ఎన్నికల వేళా జనసేన పార్టీకి ఎదురుదెబ్బ

Update: 2019-03-24 02:40 GMT

ఎన్నికల వేళా జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందినా కీలక నేత, పామర్రు మాజీ శాసన సభ్యుడు డీవై దాసు జనసేనకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పామర్రు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు దాసు. టిక్కెట్ రాకపోవడంతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.

మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆహ్వానం మేరకు జనసేనలో చేరానని.. కానీ తనకు కాకుండా వేరొకరికి టిక్కెట్ ఇవ్వడంతో మనస్థాపం చెందినట్టు ఆయన తెలిపారు. జనసేనలో చేరితే బీఎస్పీ టిక్కెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు తన తరఫున తన మనుషులను పంపితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోపెట్టి పార్టీ నేతలు కనీసం పట్టించుకోలేదని వాపోయారు. కాగా మిత్రులు శ్రేయోభిలాషులతో కలిసి చర్చించిన అనంతరం భవిశ్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని దాసు తెలిపారు. 

Similar News