కడప జిల్లాలో మొదటి టికెట్ కన్ఫామ్ చేసిన చంద్రబాబు

Update: 2019-01-19 02:05 GMT

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం టిక్కెట్ల వ్యవహారంలో తలమునకలై ఉన్నారు. పార్టీలోని బలమైన నేతలకు టిక్కెట్లు కేటాయించడం తోపాటు ఇతర పార్టీల్లో ప్రజాధారణ కలిగిన నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో వైయస్ఆర్ కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అహ్మదుల్లా ను టీడీపీలో చేర్చుకుంది. అంతేకాకుండా ఆయన కుమారుడు అష్రాఫ్ ను కడప నియోజకవర్గం ఇంచార్జ్ గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో అష్రాఫ్ కే టికెట్ ఇస్తున్నట్టు జిల్లానేతలకు స్పష్టం చేశారు. అష్రాఫ్ కు అన్ని విధాలా తోడ్పాటు అందించాలని సూచించారు.

కాగా టీడీపీలో చేరిన అహ్మదుల్లా రెండేళ్ల క్రితమే వైసీపీలో చేరాలని తీవ్ర ప్రయత్నాలు చేశారట. అయితే కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మేయర్ సురేష్ బాబు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా అహ్మదుల్లా చేరికను వ్యతిరేకించారు. దాంతో ఆయన తన కుమారుడు రాజకీయ భవిశ్యత్ దృష్ట్యా టీడీపీలో చేరినట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Similar News