ఆంధ్రప్రదేశ్ : మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్

Update: 2020-03-09 14:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ,కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్నుఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ జారీ చేసారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 15 కార్పొరేషన్ లలో 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 3 కార్పొరేషన్ లలో ఎన్నికలు వాయిదా వేస్తున్నామన్నారు. నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు కోర్టు కేసులు రీత్యా వాయిదా వేస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. వాటితో పాటుగానే రాష్ట్రంలో 104 మున్సిపాలిటీ, నగర పంచాయితీల్లో ఉండగా 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు. 29 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో కోర్టు కేసుల రీత్యా ఎన్నికల్లో వాయిదా వేస్తున్నామని స్పష్టం చేసారు. ఈ ఎన్నికలను కూడా ఒకే విడతలో నిర్వహించనున్నామని తెలిపారు.

ముఖ్యమైన తేదీలు..

ఎన్నికలను నిర్వహించడానికి గాను ఈనెల 11వ తేది నుంచి 13వ తేది వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నామని తెలిపారు. మార్చి 14 నామినేషన్లను పరిశీలించనున్నామన్నారు. మార్చి 16 తేదీ 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ. అదే రోజు 3 గంటలు తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు జాబితా ప్రకటన చేయనున్నారు. ఈనెల 23 తేదీ ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు పోలింగ్, మార్చి 27 తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేసారు.




Tags:    

Similar News