ఏపీలో ఓట్ల తొలగింపుపై ఈసీ సీరియస్‌.. కేసులు నమోదు చేయాలని ఆదేశాలు

Update: 2019-03-03 15:05 GMT

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఎన్నికల కమీషన్ సీరియస్ అయింది. ఓటర్ల అనుమతి లేకుండా ఓట్లు తొలగిస్తున్న వారిపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లకు చీఫ్ ఎన్నికల కమీషనర్ గోపాల్‌ కృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల తొలగింపుకు సంబంధించి తప్పుడు ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని సూచించారు.. వారం కిందట వేల సంఖ్యలో ఓట్ల తొలగింపునకు ఫారం-7 అప్లికేషన్లు వచ్చినట్లు ఈసీ గుర్తించిందన్నారు. ఆన్‌లైన్‌లో గుంపగుత్తగా ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 9 జిల్లాల్లో 45 కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.

Similar News