మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదైంది.

Update: 2020-01-03 04:53 GMT
Rayapati Sambasiva Rao (File Photo)

టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై ఈడీ కేసు నమోదైంది. 16 కోట్ల రూపాయలను సింగపూర్, మలేషియా రష్యా కు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. నిధుల మల్లింపుపై ఫెమా చట్టం కింద రాయపాటి తోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీయాపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే రాయపాటి తోపాటు ఆయన కుమారుడు రంగారావు.. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై 120(బి), రెడ్ విత్ 420, 406, 468, 477(ఎ), పీసీఈ యాక్ట్ 13(2), రెడ్ విత్ 13(1)డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని నవంబర్ 18న సీబీఐకి యూనియన్ బ్యాంకు రీజినల్ హెడ్ భార్గవ ఫిర్యాదు చేశారు. దాంతో రాయపాటి సాంబశివరావు ఇళ్ళు, ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలో రాయపాటికి సంబంధించిన కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. కాగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి 15 బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి రూ.8832 కోట్లు ఋణం ఇచ్చింది. అయితే ఇందులో రూ. 3822 కోట్లు దారి మళ్లించినట్లు సిబిఐ అనుమానిస్తోన్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News