Election Commission: ఏపీ సహా ప‌లు రాష్ట్రాల్లో ఉపఎన్నిక‌లు వాయిదా

Election Commission: దేశంలో కరోనా వైర‌స్ రెండో ద‌శ‌ తీవ్రత పెరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-05-06 02:46 GMT

Election Commission of India 

Election Commission: దేశంలో కరోనా వైర‌స్ రెండో ద‌శ‌ తీవ్రత పెరగడంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో ఏపీతో స‌హా ప‌లు రాష్ట్రాల్లో జ‌ర‌గాల్సిన ఉప‌ఎన్నిక‌ల విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెన‌క్కి త‌గ్గింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా వ్యాప్తికి ఈ ఎన్నిక‌లే కార‌ణ‌మని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కాగా, ఇటీవలే తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. తిరుపతిలో వైసీీపీ అభ్యర్థి గురుమూర్తి, నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ నేత నోముల భగత్ విజయం సాధించారు.

దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తికి ఈ ఎన్నిక‌లే కార‌ణ‌మని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 8 అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే ఈసీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేసింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుపడి మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌‌లోని ఖండ్వా, కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్‌హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్ల‌మెంట్ స్థానాల‌కు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు కర్నాటకలోని సిండ్గి, హర్యానాలోని కల్కా, ఎలియాబాద్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్, రాజస్థాన్‌లోని వల్లభ్‌నగర్, మేఘాలయాలోని రాజబల, మారైంగ్‌కెంగ్, ఏపీలోని బద్వేలులో ఉపఎన్నికలు జరగాల్సివుంది.

కడప జిల్లాలోని బద్వేలులో అధికార పార్టీ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. ఈనేపథ్యంలో బద్వేలులో ఉపఎన్నిక అనివార్యమయింది. ఆయా రాష్ట్రాల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత పరిస్థితిపై సమీక్షించనున్నారు. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా.. తగిన సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం వెల్లడించింది. 

Tags:    

Similar News