ఏపీ సీఎం సహయనిధికి మైహోమ్ రూ.3 కోట్లు విరాళం

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజృభించింది. దేశంలోనూ ఈ వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయింది.

Update: 2020-04-10 13:27 GMT
MD Ranjith Kumar, YSJagan

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజృభించింది. దేశంలోనూ ఈ వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోయింది.ప్రాణాంత‌క వైర‌స్ వ్యాప్తి నివావ‌ర‌ణ‌, బాధితుల‌కు స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి మైహోమ్ ఇండ‌స్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ మూడు కోట్ల రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మైహోమ్ సంస్థ‌ల ఎండీ రంజిత్ కుమార్ అంద‌జేశారు. 

దీంతో కేంద్రం లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంతా ఇళ్లకే ప‌రిమితం అయ్యారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే 370 మందికి ఈ వైర‌స్ సోకింది. ఆరుగురు మృత్యువాత‌పడ్డారు. మరికొంత మందిని అధికారులు ఐసోలేష‌న్ వార్డుల‌కు, క్వారెంటైన్ కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. క‌రోనా వైర‌స్ పై పోరుకు ప‌లువురు ప్ర‌ముఖులు విరాళాలు అందిస్తున్నారు.


Tags:    

Similar News