MP Raghu Rama Raju: రఘురామరాజుకు 18 రకాల టెస్టులు చేసిన వైద్యులు

MP Raghu Rama Raju: కలర్ డాప్లర్, 2డి ఎకో, బ్లడ్ బ్లీడింగ్ అండ్ క్లాటింట్ టైం టెస్టులు

Update: 2021-05-16 06:46 GMT
రఘు రామ రాజు (ఫైల్ ఇమేజ్)

MP Raghu Rama Raju: నరసాపురం ఎంపీ రఘ రామ కృష్ణం రాజుకు గుంటూరు జీజీహెచ్‌లో 18 రకాల టెస్టులు నిర్వహించారు. కలర్ డాప్లర్, 2డి ఎకో, బ్లడ్ బ్లీడింగ్ అండ్ క్లాటింట్ టైం లాంటి సాధారణ టెస్టులు చేశారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి, ఫిజిషియన్‌తో వైద్య బృందాన్ని హైకోర్టు ఏర్పాటు చేసింది. ఇంకా వైద్య పరీక్షల రిపోర్టులు రావల్సి ఉండడంతో రఘురామ జీజీహెచ్‌లోనే ఉన్నారు. టెస్టుల రిపోర్ట్స్ వచ్చాక.. నివేదికను హైకోర్టుకు, 6వ జూనియర్ సివిల్ కోర్టుకు ఇవాళ సాయంత్రంలోగా వైద్య బృందం సమర్పించనుంది.

మరోవైపు.. రఘురామ కేసులో సెల్‌ఫోన్ డాటా కీలకంగా మారింది. ప్రసంగాల వెనక ఎవరున్నారనే కోణంలో సీఐడీ విచారిస్తోంది. వాట్సాప్‌తో పాటు ఇతర సోషల్ మీడియా చాటింగ్‌లు, మెసేజ్ ఛాటింగ్‌లు కీలకంగా మారాయి. ఆయనతో చాట్ చేసిన వారిలో భయం అలుముకుంది. విద్వేషపూరిత ప్రసంగాల్లో సాయం చేసిందేవరో అని సీఐడీ ఆరా తీస్తోంది.  కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్‌కి రఘురామ కొడుకు భరత్‌ లేఖ రాశారు. తన తండ్రిని ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని భరత్ పేర్కొన్నారు.

Tags:    

Similar News