ఏపీలో జిల్లాల వారీగా జడ్పీ రిజర్వేషన్లు ఖరారు..లిస్ట్ ఇదే..
ఏపీలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లపై గెజిట్ విడుదల అయింది.
ఏపీలో జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లపై గెజిట్ విడుదల అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 13 స్థానాల్లో ఆరు స్థానాలను మహిళలకు కేటాయించారు. ఇందులో 2 బీసీ (మహిళ) , 3 జనరల్ (మహిళ), 1 ఎస్సి (మహిళ) స్థానాలు ఉన్నాయి. అలాగే జనరల్ స్థానాలను మాత్రం మూడుకే కుదించారు. ఇక నెల్లూరు జిల్లాకు ఆశ్చర్యకరంగా ఎస్టీకి కేటాయించారు.
జిల్లాల వారీగా జడ్పీ రిజర్వేషన్లు ఇలా..
♦ శ్రీకాకుళం : జనరల్
♦ విజయనగరం : ఎస్సి (మహిళ)
♦ విశాఖపట్నం : బీసీ (మహిళ)
♦ తూర్పు గోదావరి : జనరల్ (మహిళ)
♦ పశ్చిమ గోదావరి : బీసీ (మహిళ)
♦ కృష్ణా : బీసీ
♦ గుంటూరు : జనరల్ (మహిళ)
♦ ప్రకాశం : జనరల్
♦ నెల్లూరు : ఎస్టీ
♦ వైఎస్ఆర్ కడప : జనరల్
♦ కర్నూలు : జనరల్ (మహిళ)
♦ అనంతపురం : ఎస్సి
♦ చిత్తూరు : బీసీ