Vijayawada: విజయవాడలో రెండో రోజు గాయిత్రీ దేవిగా కనకదుర్గమ్మ
11 రోజుల పాటు వివిధ రూపంలో అమ్మవారు దర్శనం అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు గాయిత్రీ అమ్మవారిని దర్శించడంతో ఆరోగ్యం లభిస్తుంది
Vijayawada: విజయవాడలో రెండో రోజు గాయిత్రీ దేవిగా కనకదుర్గమ్మ
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో కనకదుర్గ అమ్మవారు రెండవ రోజు గాయిత్రీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 11 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపంలో భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి రోజుకి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. గాయిత్రీ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఆరోగ్యం లభిస్తుందని పండితులు తెలిపారు.