జగన్ ఆదేశిస్తే విజయవాడ లోక్ సభకు పోటీ చేస్తా : టీడీపీ కీలక నేత

Update: 2019-02-16 00:04 GMT

గత రెండు రోజులనుంచి టీడీపీకి చెందిన కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారు. శుక్రవారంకూడా టీడీపీ కీలకనేత, ప్రముఖ వ్యాపార వేత్త దాసరి జై రమేశ్, అడుసుమల్లి జయప్రకాశ్ జగన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జై రమేశ్.. మంచిరోజు చూసుకుని త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని తెలిపారు. జగన్ ఆదేశిస్తే విజయవాడ లోక్ సభ నుంచి పోటీ చేస్తానని అన్నారు. తాను పోటీ చేసినా, చేయకపోయినా పార్టీలో మాత్రం చేరతానని చెప్పారు. తమ భేటీలో ఎలాంటి డిమాండ్లు లేవని, పార్టీ విషయాలు, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించామని వెల్లడించారు.

అలాగే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విలువలు నాకు నచ్చాయి. టీడీపీ నుంచి నేను సంపాదించింది ఏమీ లేదు. పార్టీకి.. చంద్రబాబుకు నేను ఎంతగానో సాయం చేశాను. చంద్రబాబు సీఎం కావడానికి నేను కూడా ఒక కారణం. నాదెండ్ల సీఎం ఐనప్పుడు పార్టీ కాపాడటానికి నా వంతు ప్రయత్నాలు చేశాను. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే అడుసుమల్లి జయప్రకాశ్, జై రమేశ్ చేరిక వెనుక మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది.

Similar News