ఏపీలో అందుబాటులోకి కోవిడ్ టెస్టింగ్ కిట్లు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 329కి చేరిన విషయం తెలిసిందే.

Update: 2020-04-08 08:23 GMT
Y.S.Jaganmohan Reddy (file photo)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 329కి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు గౌతమ్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్‌-19 ర్యాపిండ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ను సీఎం పరిశీలించారు. కరోనా పరీక్షల కోసం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఆంధ్రప్రదేశ్ లోనే తయారు చేశారు.

విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో కిట్లను పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1000 కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కిట్ల ద్వారా 55 నిమిషాల్లోనే కరోనా.. టెస్టింగ్‌ రిపోర్టు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క కిట్‌తో రోజుకు 20 టెస్టులు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరో వారం రోజుల్లో 10వేల కొవిడ్‌-19 టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రత్యేక సర్వే చేసిది. కరోనా లక్షణాలతో ఉన్న ఐదు వేల మందిని అధికారులు గుర్తించారు. వారిలో దాదాపు 2వేల మందికి కరోనా టెస్టులు అవసరమని గుర్తించారు.


Tags:    

Similar News