Coronavirus : ఏపీలో కలకలం.. ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్

రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 473కి చేరింది.

Update: 2020-04-14 13:09 GMT
Representational Image

రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 473కి చేరింది. అనంతపురంలో ఇప్పటి వరకు 17 పాజిటివ్ కేసులు నమోదవగా ఇద్దరు చనిపోయారు. తాజాగా అనంతపురం జిల్లా ఓ ఎమ్మార్వోకు కరోనా వైరస్ సోకిన ఘటన వెలుగులోకి వచ్చింది. తహశీల్దార్ కు కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తహశీల్దార్ తో పాటు అతనికి సన్నితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

ఇప్పటికే పలువురిని గుర్తించి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఎమ్మార్వో కారు డ్రైవర్, అటెండర్‌తో పాటు పలువురికి నమూనాలు సేకరించి టెస్టుల నిర్వహించారు. వారి రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే తహశీల్దార్ మడకశిర ఎమ్మెల్యేతో తిప్పేస్వామి నిర్వహించిన సమావేశమయ్యారని హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కూడా క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

తాజాగా ఇవాళ వెలుగు చూసిన కేసుల్లో గుంటూరు జిల్లాలోనే 16 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 109 కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. కర్నూలులో 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 2, కృష్ణ జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7, నెల్లూరులో ఒక కేసు నమోదయ్యాయి. ప్ దీంతో రాష్ట్రంలోని 473 కేసుల్లో 14 మంది కోలుకున్నారు. 9 మంది మరణించారు. ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం గుంటూరులోనే ఉన్నాయి.


Tags:    

Similar News