Coronavirus: ఏపీలో మరో 5 పాజిటివ్ కేసులు..

కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. కర్నూలు జిల్లాలో తాజాగా మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2020-04-11 04:03 GMT

కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. కర్నూలు జిల్లాలో తాజాగా మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు జిల్లాలో కలెక్టర్‌ వీరపాండ్యన్‌ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం మరో 5 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు.

దీంతో కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 82కు చేరింది. పాజిటివ్‌గా తేలిన ఐదుగురు దిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారి కుటుంబ సభ్యులుగా గుర్తించినట్లు కలెక్టర్‌ వీరపాండ్యన్‌ స్పష్టం చేశారు.

రోజురోజుకు పెరుగుతున్న చూసి పాజిటివ్ కేసులు కర్నూలు జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక రాష్ట్రంలో 386 కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పదిమంది ఈ వైరస్ బారినుండి కోలుకున్నారు. 

Tags:    

Similar News