Coronavirus: ఏపీలో మరో 9 కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్క‌రోజే 9 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.

Update: 2020-04-17 04:08 GMT

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్క‌రోజే 9 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. రాష్ట్రంలో కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గురువారం మూడేసి పాజిటివ్ కేసుల చొప్పున వచ్చాయి. అలాగే ఈ మ‌హమ్మారి బారిన‌ప‌డి ఐదుగురు మ‌ర‌ణించారు.ఏపీలో నమోదైన కేసుల్లో 40 మంది మూడు సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు వయసు వారు ఉన్నారు.

వారి కుటుంసభ్యులు ఎవరో ఒకరు ఢిల్లీ ఢిల్లీలోని తబ్లిగీ జమాత్‌కు హాజరైన వారే కావడం గమనార్హం. దీంతో క‌రోనా వైర‌స్ వ‌ల‌న మ‌ర‌ణించిన వారి సంఖ్య 14కు చేరింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరింది. మ‌రో 20 మంది బాధితులు డిశార్చ్ అయ్యారు. ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఓ మహిళా వార్డు వాలంటీర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

రాష్ట్రంలో జిలాల వారిగా పాజిటివ్ కేసులు ప‌రిశీలిస్తే గుంటూరు జిల్లాలో అత్య‌ధికంగా 122 కేసులు న‌మోద‌య్యాయి, క‌ర్నూలు (113,), కృష్ణ(48), కడప(36), నెల్లూరు(58), ప్రకాశం(42), పశ్చిమ గోదావరి(34), చిత్తూరు(23), అనంతపూరం(21), విశాఖపట్నం(20), తూర్పు గోదావరి(17) జిల్లాలు ఉన్నాయి. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాలు కోవిడ్ ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి 

Tags:    

Similar News