ఏపీలో కొత్తగా 56 పాజిటివ్ కేసులు.. కర్నూలులో డబుల్ సెంచరీ క్రాస్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి.

Update: 2020-04-22 06:16 GMT
Representational Image

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో జరిగిన కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కర్నూలులో 19, కృష్ణా జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 19, ప్రకాశం 4, చిత్తూరు 6, కడప జిల్లాలో 5, కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 813కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 24 మంది మరణించారు, 120 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 669గా ఉంది.

♦ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 203 కేసులు నమోదయ్యాయి.

♦ గుంటూరు 177

♦ కృష్ణా జిల్లా 86

♦ నెల్లూరు 67

♦ ప్రకాశం 48

♦ కడప 51

♦ అనంతపురం 36

♦ చిత్తూరు 59

♦ తూర్పు గోదావరి 26

♦ పశ్చిమ గోదావరి 39

♦ విశాఖపట్నం 21

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతానికి ఒక కేసు నమోదుకాలేదు.




 

Tags:    

Similar News