బెజవాడలో డేంజర్.. లారీ డ్రైవర్ ద్వారా 8 మందికి పాజిటివ్

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాడవం చేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తోంది.

Update: 2020-04-25 06:30 GMT
Representational Image

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాడవం చేస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు, కర్నూలు తర్వాత కృష్ణాజిల్లా అత్యధిక కేసులు నమోదయ్యాయి. విజయవాడ నగరంలో కరోనా పంజా విసురుతోంది. నగరంలోని కృష్ణలంకలో నమోదైన కేసుల్లో సగం ఓ లారీ డ్రైవర్ నుంచే వచ్చాయని సమాచారం. కోల్‌కతా వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్ వల్ల 8 మందికి కరోనా సోకినట్లు గుర్తించారట. విజయవాడలో శుక్రవారం నమోదైన 14 కేసుల్లో ఎనిమిది కేసులు డ్రైవర్ కాంటాక్ట్ ద్వారా ద్వారా వచ్చినవే ఉన్నాయట. కృష్ణలంకలోని కార్మికనగర్‌లో రెండు, సింగ్‌నగర్‌లో నాలుగు. వాంబే కాలనీలో ఒక కేసు నమోదయ్యాయట. దీంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా మరికొంతమందిని క్వారంటైన్‌కు తరలించారు.

ఇప్పటివరకు కృష్ణలంక లో 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఓ ఎస్సైకి పాజిటివ్‌ తేలింది. విజయవాడలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్సై‌లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అదే ఇంట్లో మరో ఇద్దరు కానిస్టేబుళ్లూ ఉంటున్నారు. ఓ ఎస్సై దగ్గుతో బాధపడటం పరీక్షలు నిర్వహించారు. ఎస్సై నమూనాలు సేకరించారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్ లేతలింది. అంతేకాదు ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినట్లు తేలింది. ఎస్సైతో పాటూ ఇంట్లో ఉన్న వారిని అలాగే ఎస్సై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది 60మందిని క్వారంటైన్‌కు పంపి పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News