ఏపీలో క‌ల‌క‌లం.. వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా ప‌రీక్ష‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తుంది. ఈ మ‌హమ్మ‌రి కర్నూలు, గుంటూరు జిల్లాల ప్ర‌జ‌లను క‌ల‌వ‌ర పెడుతోంది.

Update: 2020-04-17 12:32 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తుంది. ఈ మ‌హమ్మ‌రి కర్నూలు, గుంటూరు జిల్లాల ప్ర‌జ‌లను క‌ల‌వ‌ర పెడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య రెండు జిలాల ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నాయి. క‌ర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసులు సంఖ్య 252 కు చేరాయి. వైరస్ లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కరోనా అనుమానంతో టెస్ట్‌లు చేయించుకున్నారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఎమ్మెల్యే ఊపిరి పీల్చుకున్నారట.

అయితే ఆ ఎమ్మెల్యే క‌రోనా ప‌రీక్ష‌లు ఎందుకు చేయించుకున్నారో వివ‌ర‌ణ ఇచ్చారు. కర్నూలులో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన క్వారంటైన్‌కు పంపించి వైద్యం చేయించాల‌ని అధికారులను ఒత్తిడి చేశారంట‌. క్వారంటైన్ కేంద్ర‌ల‌కు వెళ్లి త‌నిఖి చేశారు. దీంతో అనుమానంతో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించాల‌ని వైద్యులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించారు. కరోనా వంటి కష్టకాలంలో అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదని.. ఎవరైనా రాజకీయాలు చేస్తే.... అది విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎమ్మెల్యే అన్నారు. కర్నూలులో కరోనాను అరికట్టేందుకు అధికారులతో క‌లిసి సమన్వయంతో ముందుకు సాగుతున్నామని హఫీజ్‌ఖాన్ వెల్ల‌డించారు. కరోనా వైర‌స్ ల‌క్ష్య‌ణాలు ఉన్న‌ట్లు అనుమానం ఉంటే స్వచ్చందంగా ముందుకొచ్చి కెఎమ్ హాస్పిటల్ అవుట్ పేషెంట్‌లు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల 38 నమోద‌య్యాయి. అలాగే క‌రోనా వైర‌స్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 14కు చేరింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరింది. మ‌రో 35 మంది బాధితులు డిశార్చ్ అయ్యారు. ప్రస్తుతం 517 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 4, చిత్తూరు 5, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు 6, కడపలో 1, కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి. 

Tags:    

Similar News