Corona Cases: అనంతపురం జిల్లా తాడిపత్రిలో విద్యార్థులకు కరోనా
* ఓ ప్రైవేట్ స్కూల్, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు కరోనా కేసులు * ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
Representation Photo
Corona Cases: అనంతపురం జిల్లా తాడిపత్రిలో విద్యార్థులకు కరోనా సోకింది. ఓ ప్రైవేట్ స్కూల్, రెండు ప్రభుత్వ పాఠశాలల్లో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులను పాఠశాలలకు పంపాలా, వద్దా అన్న ఆలోచనలో పేరెంట్స్ సతమతమవుతున్నారు. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం స్కూళ్లలో కరోనా నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు.