కలెక్టర్ల సదస్సులో జగన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-06-24 06:05 GMT

కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమావేశం జరుగుతున్న ప్రజా వేదికను అక్రమ కట్టడంగా ముఖ్యమంత్రి స్వయంగా నిర్దారించారు. ప్రజా ధనంతో అవినీతికి పాల్పడుతూ అక్రమాలతో నిర్మించిన ప్రజా వేదికలో ప్రస్తుతం నిర్వహిస్తున్నదే చివరి సమావేశమన్నారు. ఇలాంటి ప్రజావేదికను కూల్చేస్తామని జగన్ ప్రకటించారు. సామాన్యుడు తప్పు చేస్తే అందరి కంటే ముందు ప్రశ్నించే అధికారులు ఈ విషయంలోను ముందుండాలన్నారు. బుధవారం ప్రజావేదికను కూల్చివేస్తామంటూ కలెక్టర్ల సదస్సులో స్వయంగా జగన్ ప్రకటించారు.

వైసీపీ ఎన్నికల ముందు చెప్పిన విధంగా మేనిఫెస్టో హామీలు కచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలు అక్రమాలకు గానీ, దోపిడీలకు గానీ పాల్పడితే ఎంతటివారైనా సరే ఈ ప్రభుత్వం సహించదని జగన్ స్పష్టం చేశారు. అవినీతి, దోపిడీ విషయంలో మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ ఎమ్మెల్యేలకే ప్రయార్టీ ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేయాలన్నారు. కాగా మనం చేసిన మంచితో మళ్లీ ఓట్లేసేలా చేసుకోవాలి. ఎన్నికలయ్యేవరకే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక అందరు మనవాళ్లే. ఇక పెన్షన్ కావాలంటే ఏ పార్టీకి ఓటేశారు. నాకెంత లంచమిస్తావు లాంటి సంస్కృతి పోవాలన్నారు. కాగా రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్,డెత్ సర్టిఫికెట్,కాస్ట్ సర్టిఫికెట్‌కి ఇలా ప్రతీచోటా లంచం అడిగే పరిస్థితి పోవాలన్నారు.

Tags:    

Similar News