పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ..

Update: 2020-10-21 03:44 GMT

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తోపాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా పోలీస్‌ అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తరువాత.. గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 'అమరులు వారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని.. వారి త్యాగం నుంచీ ప్రతీ పొలీసు చాలా నేర్చుకోవాలని అన్నారు. ప్రతీ సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తాం అని హామీ ఇచ్చారు. నాలుగు దిక్కుల నుంచీ ఎటువంటి ఆపద వచ్చినా కాపాడే ధైర్యసాహసాలు ధర్మచక్రం చెపుతుందని అన్నారు.. అధికారం ఎంత గొప్ప బాధ్యతో సత్యమేవ జయతే అన్నది చెపుతుందని అన్నారు. 1959 అక్టోబర్ 22న పోరాడిన ఎస్సై కరన్ సింగ్ ధైర్యాన్ని, పదిమంది పోలీసుల త్యాగాన్ని మన దేశం గుర్తు చేసుకుంటొందని అన్నారు.. ప్రజల బాగోగులకోసం పాటుపడిన ప్రతీ పోలీసు అమరవీరుడికి జేజేలు అన్నారు.

దేశం అభివృద్ధి చెప్పే తలసరి ఆదాయం కన్నా ముఖ్యమైనది నేరాల రేటు తక్కువగా ఉండటం.. అభివృద్ధి చెందుతున్న మనలాంటి సమాజలాలో నేరాలు అంత త్వరగా తగ్గుతాయని అనుకోవడం లేదని చెప్పారు.. లా అండ్ ఆర్డర్ ప్రధానమైన విషయం అని చెప్పిన సీఎం.. పౌరుల భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించద్దని అన్నారు.. కుల మత ఘర్షణలలో ఎలాంటి ఉపేక్ష లేకుండా పనిచేయాలని పోలీసులకు సూచించారు. దిశ పోలీసు స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు వస్తాయని.. దిశ బిల్లు త్వరలోనే కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.. ఏపీలో మొట్టమొదటిగా హోంమంత్రిగా సుచరితను నియమించామని అన్న సీఎం.. ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. ఇకనుంచి డ్యూటీలో ఉండి మరణించిన పోలీసులకు 50లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం.

Tags:    

Similar News