ఎడ్ల పందేలను వీక్షించనున్న సీఎం జగన్

Update: 2020-01-13 04:44 GMT

రేపు(మంగళవారం) కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. గుడివాడ మండలం లింగవరంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా అక్కడ జరిగే ఎడ్ల పందేలను వీక్షించనున్నారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదివారం.. మంత్రి కొడాలి నాని, ప్రభుత్వం ప్రోగ్రాముల కోఆర్డినేటర్ తలశిల రఘురాం ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఉండనుండటంతో గుడివాడలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను మంత్రి కొడాలి నాని దృవీకరించారు.

కాగా ఇవాళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు మరోసారి భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో సీఎంల భేటీ ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్య అధికారులు కూడా సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో పెండింగులో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడనున్నాయని సమాచారం. అపరిష్కృతంగా ఉన్న ఏపీ భవన్ విభజన, విద్యుత్ ఉద్యోగుల విభజన, 9,10 వ షెడ్యూల్ వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అలాగే కేసీఆర్ తో ఏకాంతంగా చర్చలు జరుపుతారని కూడా టాక్ వినబడుతోంది. 

Tags:    

Similar News