కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
CM Jagan: రెండు రోజులుగా అధికారులు, కార్యకర్తలతో జగన్ బిజీ
కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
CM Jagan: సీఎం జగన్ సొంత జిల్లా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు పులివెందుల అభివృద్దిపై సీఎం జగన్ సుథీర్ఘంగా సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో ముఖ్యంగా కడప, చక్రాయపేట, వేంపల్లి, వేముల మండలాల ముఖ్య నాయకులు , కార్యకర్తలతో సియం జగన్ సమావేశం అయ్యారు. పులివెందులతోపాటు పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనులతోపాటు పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీలో మౌళిక వసతులు,ఆసుపత్రుల ఆదునీకరణతో ఇతర అంశాలపై కీలకంగా చర్చించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ. కడపజిల్లా అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 3వేల కోట్లు పంటల బీమా అందించామని గుర్తుచేశారు. ఇకపైస్థానిక రైతులందరూ ఈ క్రాప్ తప్పనిసరిగా చేయాలని సూచించారు.