విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష

Update: 2019-08-10 14:44 GMT

సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం విద్యా శాఖపై సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చడంపై విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. తొలి విడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని జగన్ నిర్ణయించారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, నీళ్లు, ఫర్నీచర్, పెయింటింగ్స్, తరగతి గదుల మరమ్మతులు, బ్లాక్ బోర్డ్స్‌తో పాటు అదనపు తరగతి గదులను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. 

Tags:    

Similar News