బిగ్ బ్రేకింగ్ : రేపు జిల్లా ఇంచార్జ్ మంత్రులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం

Update: 2020-01-06 05:54 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు జిల్లా ఇంచార్జ్ మంత్రులతో కీలక సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంచార్జ్ మంత్రులతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను జిల్లా మంత్రులకు అప్పగించే ఛాన్స్ ఉంది. అలాగే సమావేశం సందర్బంగా 3 రాజధానుల ప్రకటనపై ఆయా జిల్లాల్లో పరిస్థితులపై మంత్రులు.. ముఖ్యమంత్రికి వివరణ ఇస్తారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో పునరావృతం కావాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే రేపు హై పవర్ కమిటీ కూడా సమావేశం అవుతుంది.

ఇందులో 10 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమావేశానికి వీరు హాజరవుతారా అన్న సందేహం నెలకొంది. అయితే హై పవర్ కమిటీ సమావేశం తరువాత.. లేదంటే ముందే సీఎం సమావేశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. ఇదిలావుంటే ఏపీలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే అన్ని జిల్లాల పరిషత్ రిజర్వేషన్లు వెల్లడయ్యాయి. అందులో భాగంగా 13 స్థానాల్లో ఆరు స్థానాలను మహిళలకు కేటాయించారు. అందులో 2 బీసీ (మహిళ) , 3 జనరల్ (మహిళ), 1 ఎస్సి (మహిళ) స్థానాలు ఉన్నాయి. అలాగే జనరల్ స్థానాలను మాత్రం మూడుకే కుదించారు. ఇక నెల్లూరు జిల్లాకు ఆశ్చర్యకరంగా ఎస్టీకి కేటాయించారు.

జిల్లాల వారీగా జడ్పీ రిజర్వేషన్లు ఇలా..

♦ శ్రీకాకుళం : జనరల్

♦ విజయనగరం : ఎస్సి (మహిళ)

♦ విశాఖపట్నం : బీసీ (మహిళ)

♦ తూర్పు గోదావరి : జనరల్ (మహిళ)

♦ పశ్చిమ గోదావరి : బీసీ (మహిళ)

♦ కృష్ణా : బీసీ

♦ గుంటూరు : జనరల్ (మహిళ)

♦ ప్రకాశం : జనరల్

♦ నెల్లూరు : ఎస్టీ

♦ వైఎస్ఆర్ కడప : జనరల్

♦ కర్నూలు : జనరల్ (మహిళ)

♦ అనంతపురం : ఎస్సి

♦ చిత్తూరు : బీసీ


Tags:    

Similar News