Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలకు చెక్

Tirumala: ఘాట్ రోడ్లను సురక్షిత మార్గాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు

Update: 2022-03-18 11:15 GMT

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలకు చెక్

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సురక్షిత మార్గాలుగా తిరుమల ఘాట్ రోడ్లను తీర్చిదిద్దేందుకు నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. అమృత యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో కొండప్రాంత్రాలను నిశితంగా పరిశీలించారు. త్వరలో సమగ్ర నివేదికను టీటీడీకి అందజేయనున్నారు.

ఇటీవల వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్‌లో విరిగి పడ్డ కొండచరియలు, అవాంతరాలను నిపుణులు సమగ్రంగా పరిశీలించారు. రెండు వేరు వేరు బృందాలుగా ఏర్పడిన సభ్యులు భక్తులు ఎక్కగలిగిన కొండ శిఖరాల పరిశీలనతో పాటు ఆకాశం నుంచి డ్రోన్లతోనూ నిశితంగా పరిశీలించారు. దీంతో వర్షం నేరుగా పడే కొండ శిఖరాలు జాలువారే తత్వాన్ని, పరిస్థితులను సరిగ్గా అంచనా వేసేందుకు డ్రోన్ల పరిశీలన ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

రెండు ఘాట్ రోడ్లపై గల సమస్యలు, వాటికి పరిష్కారాలను సూచిస్తూ జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్ జనరల్, అమృత యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఎస్.కె వాదవన్ సమగ్ర నివేదికను టీటీడీకి సమర్పించనున్నారు.

Tags:    

Similar News