Chandrababu: ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
Chandrababu: ఈనెల 4,5 తేదీల్లో పర్యటన
Chandrababu: ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
Chandrababu: ఇవాళ, రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కడియంలో పంట పొలాలను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ లతో ములాఖత్ అవుతారు.
అనంతరం రాజమండ్రిలోని ఆదిరెడ్డి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మలను పలుకరించి చంద్రబాబు వారికి ధైర్యం చెబుతారు. సాయంత్రం ఆరుగంటల 45 నిమిషాలకు మధురపూడి ఎయిర్ పోర్టుకు చేరుకుని విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు.