జగన్‌‌ పాలనపై చంద్రబాబు సెటైర్లు

సీఎం జగన్మోహన్‌‌రెడ్డి పరిపాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టు, గోదావరి వరదలపై ప్రభుత్వ తీరును తప్పుబట్టిన చంద్రబాబు మీకు చేతగాని ప్రతీ పనికీ నన్ను విమర్శించడం మాని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోండంటూ నిప్పులు చెరిగారు.

Update: 2019-08-12 10:31 GMT

సీఎం జగన్మోహన్‌‌రెడ్డి పరిపాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టు, గోదావరి వరదలపై ప్రభుత్వ తీరును తప్పుబట్టిన చంద్రబాబు మీకు చేతగాని ప్రతీ పనికీ నన్ను విమర్శించడం మాని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోండంటూ నిప్పులు చెరిగారు. గోదావరి వరద వస్తుందని, ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని రెండు నెలల ముందే పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాలను అధికారులను అప్రమత్తం చేశారని, మరి ఈ మేధావులు ఇన్నాళ్లూ ఏం చేశారంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

ఇక పోలవరంపైనా ప్రభుత్వ తీరును చంద్రబాబు ఎండగట్టారు. పోలవరంలాంటి ప్రాజెక్టు కట్టడం అంటే, కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్‌లు నిర్వహించడమంత సులభం అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాఫర్ డ్యామ్‌ కట్టడం వల్లే, ఈరోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారంటూ జగన్‌‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రతి ప్రాజెక్టు నిర్మాణంలో టెక్నికల్‌ కమిటీలు ఉంటాయని, అలాగే కేంద్ర పర్యవేక్షణ, సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుందన్న చంద్రబాబు ఈ విషయాలను సదరు మేధావులు తెలుసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 





Tags:    

Similar News