Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
Chandrababu: స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్
Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్
Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ వేశారు చంద్రబాబు లాయర్లు. చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన లాయర్లు.. బాబు హెల్త్ రిపోర్టును అటాచ్ చేశారు. ఈ పిటిషన్ రేపు వెకేషన్ బెంచ్‌లో విచారణకు వచ్చే అవకాశాలున్నాయి.
మరోవైపు ఏపీ సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలన్న పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అధికారుల కాల్‌డేటా కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై గతంలో వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. దీంతో ఇవాళ సీఐడీ కౌంటర్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో సీఐడీ అధికారుల కాల్‌డేటా కోర్టుకు ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు కోరగా.. చంద్రబాబు లాయర్ల పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్నారు సీఐడీ న్యాయవాదులు.