ప్రభుత్వ తప్పిదం వల్లే కృష్ణానదికి వరద: చంద్రబాబు

అమరావతిలో తన ఇళ్లు మునిగితే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ తప్పిదం వల్లే కృష్ణానదికి వరదలు వచ్చాయని అన్నారు.

Update: 2019-08-20 15:18 GMT

 అమరావతిలో తన ఇళ్లు మునిగితే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ తప్పిదం వల్లే కృష్ణానదికి వరదలు వచ్చాయని అన్నారు. అమరావతిలోని తన ఇంటిని ముంచేందుకు వరద నీటిని నిల్వ చేశారని.. వాటిని ఒక్కసారిగా వదలడం వల్ల.. పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. రైతులు తిరిగి కోలుకోలేనంత నష్టం జరిగిందని, అందరూ రోడ్డుపై పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాజధాని కూడా మునిగిపోతుందని, అందుకే, అభివృద్ధి చేయడం లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధానిని, తన నివాసాన్ని ముంచాలని చూస్తే, ప్రజల నివాసాలు మునిగిపోయాయని, ఇది ఎంతో దుర్మార్గమైన చర్య అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన నివాసం వద్ద డ్రోన్ ను తిప్పి అది మునిగిపోతుందని చెప్పడం, రాజధాని మునిగిపోయిందని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని విరుచుకుపడ్డారు. 

Tags:    

Similar News