కేంద్రం వద్దంది.. అందుకే అమరావతికి రుణం ఇవ్వడం లేదు : ప్రపంచ బ్యాంక్

Update: 2019-07-21 14:40 GMT

ఏపీ రాజధానికి ఇటీవల ప్రపంచ బ్యాంక్ రుణాన్ని విడుదల చేసే విషయంలో పక్కకి తప్పుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఎవరికీ తోచిన వ్యఖ్యానాలు వారు చేశారు. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ రుణ ప్రతిపాదనపై ఓ ప్రకటన జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనతోనే తాము అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు' ను విరమించుకున్నట్టు స్పష్టం చేసింది. ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుంటూ ఈ నెల 15న కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించింది.

రాజధాని ప్రాజెక్టు నుంచి తాము తప్పుకున్నప్పటికీ ఏపీ అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ద్వారా తమకు ప్రతిపాదనలు పంపితే పరిశీలించి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఇప్పటికే బిలియన్‌ డాలర్ల సాయాన్ని అందజేస్తున్నామని, అది కొనసాగుతుందని చెప్పింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో 328 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు గతనెల 27న తాము ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన విషయాన్ని ప్రకటనలో ప్రస్తావించింది. 

Tags:    

Similar News