Polavaram Project: రాష్ట్ర జలవనరుల శాఖతో పోలవరం నిపుణుల కమిటీ భేటీ

పోలవరం ప్రాజెక్టు కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో సమావేశం అయింది.

Update: 2019-12-30 07:03 GMT

పోలవరం ప్రాజెక్టు కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో సమావేశం అయింది. విజయవాడలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. ఈ సీజన్లో పూర్తి చేయాల్సిన పనులపై రాష్ట్ర జలవనరుల శాఖకు మార్గనిర్దేశం చేస్తుంది. మూడు నెలలకు ఒకసారి పనులను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని కేంద్రం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్‌కే హల్దార్‌ అధ్యక్షతన సీడబ్ల్యూసీ పీపీవో సీఈ ఆర్కే పచౌరీ కనీ్వనర్‌గా ఉన్న ఈ కమిటీలో సీఎస్‌ఆర్‌ఎంఎస్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎల్‌ గుప్తా, కృష్ణా గోదావరి బేసిన్‌ విభాగం సీఈ డి.రంగారెడ్డి, పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి బీపీ పాండే, ఎన్‌హెచ్‌పీసీ మాజీ డైరెక్టర్‌ డీపీ భార్గవ, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్‌ భూపేందర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్‌ నాగేంద్రకుమార్, సీడబ్ల్యూసీ(హైదరాబాద్‌) డైరెక్టర్‌ దేవేంద్రకుమార్‌ను సభ్యులుగా నియమించింది.

పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన తరువాత ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవలసిన చర్యలపై ఇప్పటికే కొత్త కమిటీ నివేదిక ఇచ్చింది. రెండు రోజులపాటు ఈ కమిటీ పోలవరం పర్యటించింది. ఈ సందర్బంగా ఎగువ మరియు దిగువ కాఫర్‌డ్యామ్‌ల నిర్మాణంతో పాటు స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని పోలవరం అధికారులు కమిటీకి వివరించారు. వచ్చే సీజన్‌కు స్పిల్‌వేపై వరదలను మళ్లించి ప్రధాన డ్యామ్ ఇసిఆర్‌ఎఫ్ పనులను పూర్తి చేసి 2021 నాటికి ప్రాజెక్టు నిర్మాణం మొత్తం పూర్తి చేసే కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మరోవైపు, ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బంది పడే బాధిత ప్రజల కోసం పునరావాస ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది.

41.15 మీటర్ల కాంటూర్ ఏరియా పరిధిలోని గ్రామాల్లో మొత్తం 18,620 కుటుంబాలను పునరావాసం కల్పించగా, ఇప్పటివరకు 3,922 కుటుంబాలను పునరావాసం కల్పించామని పోలవరం అధికారులు కమిటీకి తెలిపారు. మిగిలిన 14,698 కుటుంబాలను మేలో కల్పిస్తామని కమిటీకి తెలిపారు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయడానికి నిధులు విడుదల చేసేలా చూడాలని, సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలకు (రూ .55,548.87 కోట్లు) నిధులు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కోరింది. ఇప్పటివరకు చేసిన పనుల కోసం కేంద్రం నుంచి 5,103 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. 

Tags:    

Similar News