Ration Card: రేషన్ బియ్యం బదులుగా నగదు..సర్కార్ సంచలన నిర్ణయం..!!
Ration Card: ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో గతవైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పలు విధానాలకు స్వస్తి పలికి..ప్రజల కోసం వినూత్నమైన ఆలోచనలు, విధానాలతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగానే రేషన్ పంపిణీ విధానంలో మార్పులు కూడా చేపట్టింది. అయితే ఈ తరుణంలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
ప్రజల అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది. చాలా మంది రేషన్ ద్వారా అందే బియ్యాన్ని తక్కువ డబ్బులకు వేరే వారికి అమ్మేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకోవడం ఇష్టపడని లబ్దిదారులకు ప్రత్నామ్నాయంగా నగదు ఇవ్వాలన్న ఆలోచనలపై ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర క్రిష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలోని రాజపేట గ్రామంలో ఓ చౌకధరల దుకాణాన్ని సందర్శించారు. అక్కడి నుంచి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
కొత్త విధానంలో భాగంగా ఇక నుంచి ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రజల అభిప్రాయాన్ని బట్టి రేషన్ బియ్యానికి బదులుగా నగదు, రాగులు, సజ్జలు, ఇతర చిరుధాన్యాలను ఇవ్వాలన్నయోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. కొత్త విధానంలో పారదర్శకతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎలాంటి మాఫియాకు అవకాశం లేకుండా పక్కా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా మాత్రమే రేషన్ అందించనున్నట్లు తెలుస్తోంది.