సీఎం సభకు డుమ్మా కొట్టిన ఎంపీ రేణుక

Update: 2019-03-02 14:40 GMT

శనివారం కర్నూలు జిల్లాలోని కోడుమూరులో జరిగిన సీఎం చంద్రబాబు బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరింది. ఈ సభకు కోట్ల వైరివర్గమైన మంత్రి కెఇ ఫ్యామిలి కూడా హాజరైంది. కానీ కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక మాత్రం కార్యక్రమానికి రాలేదు. దీంతో రేణుక అంశం చర్చనీయాంస్యమైంది.. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలుపొందిన రేణుక ఆ తరువాత టీడీపీలో చేరారు.

తాజాగా కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి చేరికతో ఆమె రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ సీటును కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికే ఇవ్వనున్నారు చంద్రబాబు. దీంతో ఆమెకు మొండిచెయ్యి చూపినట్లయింది. అయితే ఆమెకు ఎక్కడో ఒకచోట ఎమ్మెల్యే టికెట్ సర్దుబాటు చేస్తానని చంద్రబాబు చెప్పినా.. దానిపై స్పష్టత లేకపోవడంతో ఆమె అలకబూనినట్టు తెలుస్తోంది. 

Similar News