Andhra Pradesh: అనంతపురం జిల్లాలో దారుణం
Andhra Pradesh: శివరామపేట వాలంటీర్ దారుణ హత్య * రాత్రి పొలం దగ్గర నిద్రిస్తున్న శ్రీకాంత్‌పై కత్తులతో దాడి
Representational Image
Andhra Pradesh: అనంతపురం జిల్లా శివరామపేటలో దారుణం చోటుచేసుకుంది. రాత్రి పొలంలో నిద్రిస్తున్న వాలంటీర్ శ్రీకాంత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి దాడి చేశారు. ఉదయం పొలం దగ్గరకు వెళ్లిన తల్లిదండ్రులకు శ్రీకాంత్ కొన ఊపిరితో ఉండడాన్ని చూసి వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు మార్గ మధ్యలోనే శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణలో దర్యాప్తు చేస్తున్నారు.