Botsa Satyanarayana: ఆందోళన వద్దు.. మణిపుర్ నుంచి విద్యార్థులను తీసుకొస్తాం
Botsa Satyanarayana: స్టూడెంట్స్ లిస్ట్ ఔట్ చేశాం
Botsa Satyanarayana: ఆందోళన వద్దు.. మణిపుర్ నుంచి విద్యార్థులను తీసుకొస్తాం
Botsa Satyanarayana: మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్‌ఐటీ, ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను స్వస్థలానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలుగు విద్యార్థులంతా తమతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి స్టూడెంట్స్‌ను లిస్ట్ ఔట్ చేసినట్లు చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌తో మాట్లాడి విద్యార్థులను రాష్ట్రానికి రప్పించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం ఒక హెల్ప్ లైన్ నంబర్ పెట్టామని.... విద్యార్థులు వివరాలు నమోదు చేసుకుంటే వాళ్లని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని బొత్స సూచించారు.