Botsa Satyanarayana: చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట తాను నీతిమంతుడిని అని ఆవేదన
Botsa Satyanarayana: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు సరికాదు పోచారం శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
Botsa Satyanarayana: చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట తాను నీతిమంతుడిని అని ఆవేదన
Botsa Satyanarayana: చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండి పడ్డారు. చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట తాను నీతిమంతుడిని అని ఆవేదన వ్యక్తం చేశాడని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు జైలుకు వెళ్లడం బాధకరమని ఆయన అన్నారు. కానీ ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు అవినీతి లేకుండా పాలన చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పోచారం శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇలా మాట్లాడవచ్చా అని సీఎం కేసీఆర్‌ను అడిగితే ఏం చెప్తారని ఆయన ప్రశ్నించారు.