AP Three Capitals: జగన్ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మా పోరాటం ఆగదు: కన్నా

అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనను మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ.

Update: 2019-12-30 07:19 GMT
కన్నా లక్ష్మి నారాయణ

అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనను మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ. జగన్ కు పరిపాలనా అనుభవం, అవగాహన లేకనే ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఆయన విఫల ముఖ్యమంత్రిగా చరిత్రకు ఎక్కబోతున్నారని అన్నారు. అభివృద్ధి చెందని ప్రాంతాలను ఎంచుకొని ఎవరైనా డెవలప్ చేస్తారు.. కానీ విచిత్రంగా జగన్ మాత్రం అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో రాజధానిని పెట్టాలనుకోవడం విచిత్రంగా ఉందని అన్నారు.

జగన్ వ్యవహార శైలి చూస్తుంటే రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి చెందలేదేమో అని సందేహం వ్యక్తం చేశారు కన్నా. అప్పటి ప్రభుత్వం ఆమోదించిన సభలో.. రాజధాని అమరావతిపై తీర్మానంలో జగన్ కూడా భాగమని కన్నా గుర్తు చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ఏకగ్రీవ నిర్ణయం తరువాత, ప్రధాని దీనిని విశ్వసించి, రాజధానికి పునాది వేయడానికి ఇక్కడకు వచ్చారని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం రాజధాని మార్పుకు సిద్ధమవుతోందని, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు పోరాటం ఆగదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags:    

Similar News