Nara Bhuvaneshwari: వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలే కాకుండా.. సామాన్య ప్రజలు కూడా అరాచకాలు ఎదుర్కొంటున్నారు
Nara Bhuvaneshwari: సామాన్య ప్రజలు కూడా అరాచకాలు ఎదుర్కొంటున్నారు
Nara Bhuvaneshwari: వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలే కాకుండా.. సామాన్య ప్రజలు కూడా అరాచకాలు ఎదుర్కొంటున్నారు
Nara Bhuvaneshwari: అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వార్త విని మృతి చెందిన ఆంజనేయులు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. ఆంజనేయులు కుటుంబానికి అండగా ఉంటామని భువనేశ్వరి హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా అరాచకాలు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. అరాచక పాలనకు స్వస్తి చెప్పాలంటే టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరికి ఉందని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.