రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమైన భారతీయ నృత్యోత్సవం-2019

Update: 2019-07-29 03:38 GMT

రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో ఆదివారం భారతీయ నృత్యోత్సవం - 2019 వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ, లలిత కళా నృత్య నికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కూచిపూడి, భరతనాట్యం, పేరిణి వంటి సంప్రద్యా నృత్యాలను ఈ సందర్భంగా వందలాది కళాకారులు ప్రదర్శించారు. సుమారు 50 టీములు, 70 మంది సంప్రదాయ నృత్య గురువులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఓడిశా రాష్ట్రాలకు చెందిన కళాకారులు కార్యక్రమంలో తమ ప్రతిభను ప్రదర్శించారు.

కలానికేతాన్ ఫుందర్ ఎ. ఆంజనేయులు, తిరుమల తిరుపతి దేవస్తానంస్ అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. విశ్వనాద్ తదితరులు కార్యక్రంలో పాల్గొన్నారు. 

 

Tags:    

Similar News