Minister Rajini: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన చికిత్స..

Minister Rajini: నేషనల్ క్యాన్సర్ గ్రిడ్-ఏపీ శాఖ ఆధ్వర్యంలో సదస్సు

Update: 2023-06-30 11:30 GMT

Minister Rajini: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన చికిత్స..

Minister Rajini: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ వైద్య పథకాల ద్వారా తక్కువ ఖర్చుతో చికిత్స అందించడంపై గుంటూరు జీజీహెచ్ లో సదస్సు ప్రారంభమైంది. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్-ఏపి శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఈ సదస్సుని ప్రారంభించారు. మారిన జీవనశైలితో ప్రతి ఆరు మందిలో ఒకరు క్యాన్సర్ భారిన పడుతున్నారని రజిని అన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు వైద్య పరిక్షలు చేయించుకోవాలన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 8.23లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 2.8లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించామన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. సింగపూర్ లో అత్యధిక మంది కేన్సర్ తో చనిపోతున్నారని మంత్రి విడుదల రజిని తెలిపారు.. 

Tags:    

Similar News