ఎస్సీ-ఎస్టీలకు శుభవార్త చెప్పిన మంత్రి బాలినేని

Update: 2019-06-13 05:44 GMT

విద్యుత్‌, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమరవాణాను అరికడతామన్నారు. రాష్ట్రంలో రైతులకు పగటిపూట విద్యుత్‌ సరఫరా చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వన్యప్రాణి సంరక్షణకు కమిటీల ఏర్పాటు ఫైలుపై తొలి సంతకం చేశారు. జగన్‌ వద్ద మంత్రిగా పని చేయడం ఆనందంగా ఉందన్న ఆయన ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్‌ రాయితీని పొడిగిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామన్నారు. విద్యుత్‌ టారిఫ్‌లు, పీపీఏలను సమీక్షిస్తామని అన్నారు. కేంద్రం సమీక్షించవద్దన్న విషయాన్ని సీఎం జగన్‌.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. తప్పులుంటే సమీక్షిస్తామని ప్రధానికి సీఎం వివరించినట్లు తెలిపారు. 

Tags:    

Similar News