అనంతపురంలో వైసీపీ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అనంతపురంలో కాక రేపుతున్నాయి.

Update: 2025-09-26 10:12 GMT

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అనంతపురంలో కాక రేపుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు మధ్య మాటల మంటలు పట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే బాలయ్య వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అనంతపురంలో ఆ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొహిద్దీన్ ఘాటుగా స్పందించారు. గత వైసిపి ప్రభుత్వంలో ఐదేళ్లు ఆ పార్టీ నేతలు, మంత్రులు వాడిన భాషను గుర్తు చేసుకోవాలని సూచించారు. బాలకృష్ణ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషి అని చెప్పారు. సైకో పనులు చేశారు కాబట్టి సైకో అన్నారని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News