నెల్లూరు ఆర్టీసీ స్టోర్స్ విభాగం కంట్రోలర్ సస్పెన్షన్

తిరుమల ఆర్టీసీ టికెట్‌లపై అన్యమత ప్రచారం ఎఫెక్ట్ నెల్లూరు ఆర్టీసీ అధికారులపై పడింది. నెల్లూరు ఆర్టీసీకి చెందిన ప్రకటన రోల్స్ తిరుమలకు పంపారన్న అభియోగాలపై నెల్లూరు ఆర్టీసీ స్టోర్స్ విభాగం కంట్రోలర్ జగదీశ్ బాబును ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు.

Update: 2019-08-26 02:51 GMT

తిరుమల ఆర్టీసీ టికెట్‌లపై అన్యమత ప్రచారం ఎఫెక్ట్ నెల్లూరు ఆర్టీసీ అధికారులపై పడింది. నెల్లూరు ఆర్టీసీకి చెందిన ప్రకటన రోల్స్ తిరుమలకు పంపారన్న అభియోగాలపై నెల్లూరు ఆర్టీసీ స్టోర్స్ విభాగం కంట్రోలర్ జగదీశ్ బాబును ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. తిరుమల డిపోనకు పొరపాటుగా అన్యమత ప్రచారం ఉన్న రోల్స్ వెళ్లాయని ఈడీ గోపీనాధ్ రెడ్డి వెల్లడించారు. టెకెట్ల వెనుక ప్రకటన కోసం మార్చిలో వచ్చిన యాడ్స్ జూన్ ప్రింటయ్యాయని చెప్పారు. వచ్చిన రోల్స్‌ ప్యాక్‌లో ఉండటం వల్ల వాటిని గుర్తించలేక డిస్టిబ్యూషన్‌లో తిరుమలకు వెళ్లాయని వివరించారు. 

Tags:    

Similar News