AP Weather Update: వేసవి తాపం నుంచి ఉపశమనం.. నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన!
AP Weather Update: వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, దీనివల్ల ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపింది.
AP Weather Update: వేసవి తాపం నుంచి ఉపశమనం.. నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన!
AP Weather Update: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినా, చాలా చోట్ల మాత్రం అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేడిగాలులు, ఉక్కపోతతో విలవిల్లాడారు. అయితే, వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, దీనివల్ల ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపింది.
మంగళవారం అర్థరాత్రి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బుధవారం ఉదయం కూడా గుంటూరు, విజయవాడ, కోనసీమ, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాదు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.
విశాఖపట్నంలో మొన్నటి వరకు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కానీ, నిన్న ఒక్కసారిగా 28 డిగ్రీలకు పడిపోయింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అరకు, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలు ఎట్టకేలకు మండుటెండల నుంచి ఊపిరి పీల్చుకున్నారు.