AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Update: 2024-04-12 05:42 GMT

AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Inter Results 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌ పరీక్షలను 4 లక్షల మంది విద్యార్థులు రాయగా 67 శాతం, సెకండియర్‌ పరీక్షలకు 3 లక్షల మంది హాజరుకాగా 78 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఒకేషనల్ పరీక్ష రాసిన 38 వేల మందిలో 71 శాతం మంది పాసయ్యారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు లోనుకావద్దని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరోసారి రాసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

Tags:    

Similar News