AP Super Six Guarantees: మహిళలకు అదిరిపోయే శుభవార్త..త్వరలో నెలకు రూ. 1500 రూపాయలు..!!

AP Super Six Guarantees: ఏపీలోని మహిళలకు శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నాలుగు రోజుల క్రితం తల్లికి వందనం పథకం ప్రారంభించింది. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.

Update: 2025-06-16 10:03 GMT

AP Super Six Guarantees: మహిళలకు అదిరిపోయే శుభవార్త..త్వరలో నెలకు రూ. 1500 రూపాయలు..!!

AP Super Six Guarantees: ఏపీలోని మహిళలకు శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా నాలుగు రోజుల క్రితం తల్లికి వందనం పథకం ప్రారంభించింది. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఈ స్కీమ్ పూర్తిగా మహిళలకు సంబంధించింది.

సూపర్ సిక్స్ హామీలతో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతోంది. గత ఏడాది పెన్షన్ పెంపుతోపాటు ఫ్రీ గ్యాస్ సిలెండర్ స్కీములను ప్రారంభించింది. ఇటీవల నాలుగు రోజుల క్రితం తల్లికి వందనం స్కీమును ప్రారంభించింది. పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో 13వేలు జమ చేసింది. త్వరలోనే అన్నదాతలకు హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ స్కీమును ప్రారంభించనుంది. రైతులకు ఈ పథకంలో భాగంగా ఏడాదికి 20వేలు అందించనుంది. త్వరలోనే మరో సూపర్ సిక్స్ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ స్కీమ్ కు సంబంధించి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనుంది.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి ఆడ బిడ్డ నిధి. త్వరలో ఈ పథకం అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నవారు. ఈ స్కీములో భాగంగా 18ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 అందించనుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు 15నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్ కంటే ముందే ఆడబిడ్డ నిధి స్కీమ్ అమలు చేయవచ్చని తెలుస్తోంది.

ఈ స్కీములో భాగంగా నెలకు రూ. 1500 అందించనుంది. ఇది 18ఏళ్లు దాటిన మహిళలకు అందుతుంది. దీనికోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించేందుకు వెబ్ సైట్ డిజైన్ జరుగుతోంది. ఈ స్కీమ్ కోసం 3వేల కోట్ల నిధులు రెడీ చేస్తోంది. త్వరలో ఈ స్కీమ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. బడ్జెట్లో కూడా ఈ మేరకు నిధులు కేటాయించింది. బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు వెయ్యి కోట్ల రూపాయలు, ఆర్థికంగా వెనకబడిన మహిళలకు 630కోట్లు, మైనార్టీమహిళలకు రూ. 84కోట్లు కేటాయిస్తున్నారు.

Tags:    

Similar News