మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2019-12-29 07:04 GMT
Andhrapradesh Chief Minister YS Jagan Mohan Reddy

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ నివేదిక సమర్పించింది. జనవరి మూడో తేదీన బీసీజీ కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అయితే ఈ కమిటీల నివేదికలను అధ్యయనం చేయడానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో 10 మంది కెబినెట్‌ మంత్రులు, ముఖ్య సలహాదారు, ఉన్నతాధికారులు ఉన్నారు.ఈ హైపవర్ కమిటీకి చీఫ్ సెక్రటరీ.. కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. మూడు వారాల్లోగా కమిటీ నివేదికను ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ ఆదేశించారు.

కమిటీలో సభ్యులు వీరే...

♦ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి

♦ పిల్లి సుభాష్ చంద్రబోస్

♦ బొత్స సత్యనారాయణ

♦ మేకపాటి గౌతంరెడ్డి

♦ ఆదిమూలపు సురేష్

♦ మేకతోటి సుచరిత

♦ కురసాల కన్నబాబు

♦ మోపిదేవి వెంకటరమణ

♦ కొడాలి నాని

♦ పేర్ని నాని

♦ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు

♦ డీజీపీ

♦ ఛీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ

♦ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది కార్యదర్శి

♦ న్యాయశాఖ కార్యదర్శి 

Tags:    

Similar News