అసెంబ్లీకి ఏపీ ప్రభుత్వం క్షమాపణ

Update: 2019-07-18 05:15 GMT

ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. సభ ప్రారంభమయ్యే సమాయానికి చోరుకోకపోవడంపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి క్షమాపణ చెప్పారు. కేబినెట్ సమావేశం వల్ల స్వల్ప ఆలస్యం అయ్యిందని స్పీకర్‌తో పాటు సభ‌్యులకు వివరణ ఇచ్చారు . అయితే సభా ప్రారంభం కాగానే వాయిదా వేయడం మంచి సంప్రదాయం కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు .ఇలాంటి సంప్రదాయలు ఇకపై జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు . అలాగే ఏపీ మంత్రిమండలి సమావేశం కోసం అసెంబ్లీని వాయిదా వేయడం ఏంటని నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అసలు అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని అన్న విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటల పేలడంతో స్పీకర్ సభను తప్పుదోవ పట్టించొద్దన్నారు. సభా సమయాన్ని విపక్షాలు వినియోగించుకోవాలని అన్నారు. 

Tags:    

Similar News