ఏపీ లోని విద్యాసంస్థలకు 12 రోజులు దసరా సెలవులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. ఈనెల 28 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

Update: 2019-09-18 07:53 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. ఈనెల 28 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబరు 9 వరకు మొత్తం 12 రోజులు సెలవులు ఉంటాయి. విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9 వరకూ విజయదశమి సెలవులుగా పరిగణించాలి. అక్టోబర్ 10న స్కూళ్ళు తిరిగి తెరుస్తారు. అయితే, అక్టోబర్ 10, 11 తేదీలు కూడా సెలవులుగా ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అలా అయితే, అక్టోబర్ 12 రెండో శనివారం, అక్టోబర్ 13 ఆదివారం సెలవులు కలిసి వస్తాయనీ వారు కోరుతున్నారు. వారు కోరినట్టు సెలవులు పొడిగిస్తే మొత్తం 16 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయి. మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక సెలవు రోజుల్లో తరగతులు నడిపించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడం తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది.


Tags:    

Similar News